ఏపీలో నేతన్న సేవలో పథకం 2026.. ప్రతి అర్హత కుటుంబానికి రూ.25,000 సాయం, 51,952 మంది లబ్ధిదారులు

Nethanna Sevalo Scheme 2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత రంగాన్ని బలోపేతం చేయడం, సంప్రదాయ నేత వృత్తిలో కొనసాగుతున్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం లక్ష్యంగా ‘నేతన్న సేవలో’ (Nethanna Sevalo Scheme 2026) పేరుతో కొత్త సంక్షేమ పథకాన్ని అమలు చేయనుంది. రాష్ట్రంలో చేనేత కార్మికులు పవర్‌లూమ్ రంగంతో పోటీపడుతూ జీవనోపాధిని కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించింది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం తాజాగా విడుదల చేయగా, ఆగస్టు 7 నుంచి అమలు